కార్మికులకు పీఎఫ్, బీమా సౌకర్యం వర్తింపజేసేలా చూడాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించేలా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన క్లస్టర్ అధికారులతో కొత్త పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో కార్మికులకు పీఎఫ్, బీమా సౌకర్యం వర్తింపజేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను సత్వరమే పరిషరించాలి
హౌసింగ్‌బోర్డుకాలనీ, ఆగస్టు 23: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల సమస్యల పరిషారానికే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిషరించాలని అధికారులను ఆదేశించారు. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామం నుంచి రత్నం మాట్లాడుతూ, దళిత వాడలో 45 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించగా, ఇంతవరకు తమకు ఎలాంటి ప్రొసీడింగ్ రాలేదని తెలుపగా పరిశీలించి సమస్యను పరిషరిస్తామని తెలిపారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామం నుంచి అశోక్ మాట్లాడుతూ, తనకు పింఛన్ రావడం లేదని తెలుపగా పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవించగా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి 106 దరఖాస్తులు
కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకు చెందిన 106 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందజేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. దరఖాస్తులను పరిషరించడానికి వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మారెటింగ్ డీడీ పద్మావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, వ్యవసాయాధికారి శ్రీధర్, వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహర్, డీపీవో వీరబుచ్చయ్య, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, సూపరింటెండెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.