ఆత్మగౌరవంతో బతకాలనే అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు
ఈటల ఏనాడూ బీసీల కోసం సీఎంను అడగలేదు
టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అండగా నిలవాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్‌లో మున్నూరు కాపు,రజక సంఘం నేతలకు ప్రొసీడింగ్ ప్రతుల అందజేత
పాల్గొన్న మంత్రి తలసాని
హుజూరాబాద్ టౌన్/హుజూరాబాద్‌రూరల్, జూలై 22: స్వరాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని కులా లు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఒక్కో కుల సంఘం భవనానికి ఎకరం స్థలంతో పాటు నిర్మాణానికి మొదటి విడతగా 50లక్షలు మంజూరు చేశారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ సిటీ సెంటర్‌హాల్‌లో కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసానితో కలిసి పాల్గొన్నారు. మున్నూరు కాపు, రజక సంఘం ప్రతినిధులకు కమ్యూనిటీ భవనాల మంజూరు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడారు. స్వాతం త్య్రం వచ్చిన ఇన్నేండ్లలో ఎందరో ప్రధానులు, సీఎంలు మారినా.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సంకల్పించని విధంగా కుల సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇకడి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఏనాడూ కేసీఆర్‌ను బీసీల గురించి అడగకుండా ద్రోహం చేశాడని మండిపడ్డారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదని, అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, సీఎం దృష్టికి ఏనాడూ తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు. ఏదైనా మీటింగైనా.. సమ్మేళనమైనా ఫంక్షన్ హాళ్లల్లో, హోటళ్లలో నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి కులస్తులు అడిగిన వెంటనే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారని చెప్పారు. తొలి విడతగా మున్నూరు కాపు భవనానికి 1.11 ఎకరాలు, రజక కుల సంఘ భవనానికి ఎకరం స్థలం కేటాయింపుతోపాటు 50లక్షల నిధుల చొప్పున మంజూరు పత్రాలను సంఘ ప్రతినిధులకు అందించినట్లు చెప్పారు. ఈటల నిర్లక్ష్యంతో వెనుకబడ్డ హుజూరాబాద్‌లో ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఇంతలా మన సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎంకు అండగా నిలువాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని, రాబోయే ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.