చిగురుమామిడి, నవంబర్ 21: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మండల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా కారణంగా గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరం అలా ఉండదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా కస్తూర్భా మోడల్ సూల్తో కలిపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. 1300 మంది విద్యార్థులు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. 2018 -19 సంవత్సరం వార్షిక పరీక్షలు రాయగా, కరోనా నేపథ్యంలో గత 2019 -20, 2020 -21 సంవత్సరం పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా పదో తరగతి ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గంట చొప్పున 2 సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80శాతం సిలబస్ పూర్తికాగా, ఈ నెల చివరి వరకు 100% పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షల వరకు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
మెరుగైన ఫలితాలను సాధిస్తాం
మోడల్ సూల్లో ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 80 శాతం సిలబస్ పూర్తి చేశాం. డిసెంబరు మొదటి వారంలో రివిజన్ చేయాలని భావిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఉపాధ్యాయులు వెంటనే పరిషరిస్తున్నారు.
-కొడిమ్యాల శ్రీనివాస్, మోడల్ సూల్, ప్రిన్సిపాల్ (చిన్న ములనూరు)
విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి
మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాల తోపాటు కస్తూర్బా మోడల్ సూల్ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రతిరోజూ వారికి ప్రత్యేక తరగతులు నిర్వస్తున్నాం. వారికి వచ్చే అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. మెరుగైన ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
-విజయలక్ష్మి, ఎంఈవో(చిగురుమామిడి)