e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home కరీంనగర్ జల్సాల కోసం ఆలయాల్లో చోరీలు

జల్సాల కోసం ఆలయాల్లో చోరీలు

సుల్తాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డ దొంగ
పరారీలో మరో ఇద్దరు..
వివరాలు వెల్లడించిన సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి

సుల్తానాబాద్‌, అక్టోబర్‌ 21: వారు ముగ్గురు కూలీ నా లీ చేసుకొంటూ బతికేవారు.. అంతటితో సంతృప్తి చెందక ముఠాగా ఏర్పడి జల్సాల కోసం దేవాలయాల్లో దొంగత నాలకు అలవాటుపడ్డారు. ఇప్పటికే పలుచోట్ల చోరీలు చేసి పోలీసులకు సవాల్‌ విసిరారు. ముఠాలోని ఓ వ్యక్తి సుల్తానాబాద్‌ పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు గురువారం సుల్తానాబాద్‌ ఠాణాలో సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా రేకుర్తికి చెందిన పత్తి కనుకయ్య, తూర్పాటి కనుకయ్య, తూర్పాటి మైసయ్య ఈనెల 19న సుల్తానాబాద్‌ మండలంలోని నీరుకుళ్ల శివారులోని రంగంపల్లిలో గల పెద్దమ్మతల్లి, ఎల్లమ్మ గుడుల్లోని హుండీలను పగులగొట్టి నగదు, దేవతల విగ్రహాలపై ఉన్న బంగా రు ఆభరణాలను దొంగిలించారు. అక్కడి నుంచి వెళ్లి రంగనాయకస్వామి ఆలయంలో తలుపు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అక్కడి నుంచి మానేరు వాగు దాటి మానకొం డూరు మండలంలోని వేగురుపల్లి ఉటూరు గ్రా మాల మధ్య ఉన్న దేవాలయాల తలుపులు పగులగొట్టా రు. నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. వాటి విలువ రూ. 45 వేలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ పత్తి కనుకయ్య(25)ను ఆయన ఇంటి వద్ద గురువారం ఉదయం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 3 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, రూ. 8 వేలు స్వాధీనం చేసుకున్నారు. మైసయ్య, తూర్పాటి కనుకయ్య పరారీలో ఉన్నారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. వీరు గతంలో జన్నారం, పోత్కపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో చోరీలు చేసి జైలుకు వెళ్లారని తెలిపారు. వీరిపై గతంలో 5 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. దొంగను పట్టుకున్న సుల్తానాబాద్‌ ఎస్‌ఐలు ఉపేందర్‌రావు, తిరుపతి, కానిస్టేబుల్‌ విష్ణువర్ధన్‌రెడ్డిని సీఐ అభినందించి రివార్డులు అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement