e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home కరీంనగర్ పోలీస్‌ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీస్‌ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

సీపీ వీ సత్యనారాయణ
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళి

రాంనగర్‌, అక్టోబర్‌ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సీపీ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్‌) పురస్కరించుకొని గురువారం కరీంనగర్‌ కమిషనరేట్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్మృతి పరేడ్‌ కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు. సమాజంలో శాంతిస్థాపన కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యతను అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలన్నారు. దేశ రక్షణలో భాగంగా 62 ఏళ్ల క్రితం అక్సాయి చిన్‌ ప్రాంతంలో జరిగిన పోరులో అమరులైన పోలీసులను స్మరిస్తూ పోలీస్‌ అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్‌) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది దేశ వ్యాప్తంగా 377 మంది వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో ప్రాణత్యాగం చేశారని వివరించారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసులు ప్రతి సమస్యను సవాల్‌గా తీసుకుంటూ, సమర్థవంతంగా విధి నిర్వహణలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని స్థాయిల పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన 47 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. దేశవ్యాప్తంగా గతేడాది నుంచి ఇప్పటి వరకు అమరులైన పోలీసుల పేర్లను అడిషనల్‌ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్‌ చదివి వినిపించారు. అనంతరం అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురసరించుకుని నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీపీ బహుమతులు అందజేశారు.

- Advertisement -

పోలీసు అమరవీరుల కుటుంబాలతో సమావేశం
పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో సీపీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విన్నపాలను స్వీకరించారు. కొన్ని సమస్యలను సత్వరమే పరిషరించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రితిరాజ్‌, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, జే విజయసారథి, శ్రీనివాస్‌, శివభాసర్‌, ప్రతాప్‌, సీపీవో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఉమేశ్‌ కుమార్‌, ఎస్‌బీఐలు వెంకటేశ్వర్లు, సంతోష్‌కుమార్‌, పోలీసుఅధికారుల అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం సురేందర్‌, మల్లేశం, జానీమియా, శేఖర్‌, మురళి, రమేశ్‌, పోలీసు అధికారులు, శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గంగాధర, అక్టోబర్‌ 21: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీసులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు నివాళులర్పించారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏర్పాటు చేసిన పోలీసు అమరుడు గుజ్జెటి మహేశ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేశ్‌ తల్లిదండ్రులకు దుస్తులు అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా చొప్పదండి సీఐ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేననివని కొనియాడారు. విధి నిర్వహణలో అసువులు బాసిన గుజ్జెటి మహేశ్‌ వంటి అమర వీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్‌, గంగాధర, రామడుగు, చొప్పదండి ఎస్‌ఐలు నరేశ్‌రెడ్డి, తాండ్ర వివేక్‌, వంశీకృష్ణ, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement