సిరిసిల్ల టౌన్, నవంబర్ 20: రైతుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నారని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం ఒకరోజు ధర్నా చేయడం.. రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తూ టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా ఆకునూరి శంకరయ్య మా ట్లాడుతూ, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసే దిశగా కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను అమలుల్లోకి తెచ్చిందన్నారు. కర్షకుల అలుపెరుగని పోరాటానికి కేంద్రం దిగి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిరిపురం గంగరాజు, వేముల చెన్నయ్య, రచ్చ వంశీ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్వై సంబరాలు..
కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడంతో టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మనోజ్‌కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. ఇక్కడ మునీర్, వరుణ్, కిరణ్, సిఖిందర్, సాయి, అఫ్రోజ్ తదితరులు ఉన్నారు.
చట్టాల రద్దు హర్షణీయం
సిరిసిల్ల రూరల్, నవంబర్ 20: కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ ఒక రోజు ధర్నా చేయడంతో శనివారం తంగళ్లపల్లి మండ లం బద్దెనపల్లిలో వారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ నల్లగొండ ప్రవీణ్, ఎల్లయ్య, శ్రావణ్, సాయిరాం, శేఖర్, మల్లయ్య, రమేశ్, సా యి, రాజు తదితరులు ఉన్నారు.
రైతుల పోరాట ఫలితమే..
కలెక్టరేట్, నవంబర్ 20: రైతుల పోరాటాల ఫలితంగానే సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతాంగం చేసిన సుదీర్ఘ పోరాటంతో మోదీ ప్రభుత్వం దిగి వచ్చిందని, ఇది రైతులు సాధించిన చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఇక్కడ మోర అజయ్, శ్రీరాముల రమేశ్చంద్ర, గడ్డం ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
కిసాన్ విజయ్ దివస్ ర్యాలీ
వేములవాడ, నవంబర్ 20: రైతుల పోరాటాలతో నే కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నదని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం వేములవాడలో కిసాన్ విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు. తిప్పాపూర్ నుంచి కోరుట్ల బస్‌స్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఇక్కడ సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, పాత సత్యలక్ష్మి, ముడికే చంద్రశేఖర్ ఉన్నారు.