ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం
పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని తీర్మానం
తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. శనివారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఎవరిని ప్రకటించినా వారినే గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేసినా వారికే ఓటు వేస్తామని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రసమయికి సన్మానం
గన్నేరువరం, నవంబర్ 20 : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం శాలువా కప్పి సన్మానించారు. టీఆర్ఎస్ మండల నాయకులు ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, న్యాత సుధాకర్, గూడూరి సురేశ్ పాల్గొన్నారు.
వివాహ వేడుకలో ఎమ్మెల్యే
మానకొండూర్, నవంబర్ 20: మండల కేంద్రంలోని సుప్రీం కల్యాణ మండపంలో శనివారం ఆపరాజు హేమలత-ఆంజనేయులు కూతురు వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు నెల్లి మురళి, ఉండింటి శ్యాంసన్, పిట్టల మధు, దండబోయిన శేఖర్ తదితరులు ఉన్నారు.