శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 24, 2021 , 04:01:34

యువత లక్ష్య సాధనకు కృషి చేయాలి

యువత లక్ష్య సాధనకు కృషి చేయాలి

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

ఆర్మీ శిక్షణ అభ్యర్థులకు టీషర్టుల పంపిణీ

 చొప్పదండి, జనవరి 23: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని భూపాలపట్నం సేయింట్‌ మధర్‌ థెరిస్సా పాఠశాలలో ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి కుమార్‌ ఆధ్వర్యంలో ఆర్మీకి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శనివారం టీషర్టులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే నిత్యం వ్యాయామంతో పాటు మైదానంలో క్రీడా సాధన చేసి, శరీరాన్ని ఫిట్‌గా తయారు చేసుకుంటే పోలీస్‌, ఆర్మీ ఇతర ఉద్యోగాలు సాధించడం సులభమవుతుందని సూచించారు. ఆర్మీలో చేరాలనుకునే యువతకు శిక్షణ ఇస్తున్న కుమార్‌ను ఎమ్మెల్యే అభినందించారు. యువకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా టీషర్టులు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు యువకులు నేర్పిస్తున్న ఆర్మీ శిక్షణపై ఎమ్మెల్యేకు కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్‌, జడ్పీటీసీ మాచర్ల సౌజన్యవినయ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, ఎస్‌ఐ వంశీకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌, నాయకులు గొల్లపల్లి శ్రావణ్‌కుమార్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, నరేశ్‌, రాజయ్య, మహేశుని మల్లేశం పాల్గొన్నారు. 

  క్యాలెండర్‌ ఆవిష్కరణ

 చొప్పదండి, జనవరి 23: నవతరం ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాండ్ల వేణు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్‌ఎస్‌ఎఫ్‌ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంక్షేమ పథకాలను విద్యార్థులకు తెలియజేసి, ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య వారధిలా ఎన్‌ఎస్‌ఎఫ్‌ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌, ఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మాచర్ల సంతోష్‌, ప్రవీణ్‌, జయంత్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo