చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవద్దు

మీ వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉందా?
బండి సంజయ్‌పై కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు ధ్వజం
కార్పొరేషన్, జనవరి 23: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నగర మేయర్ వై సునీల్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ అశాంతి, అలజడి, ప్రజలు ఆందోళనల్లోనే ఉండాలన్న మనస్తతం ఆయనదని మండిపడ్డారు. శనివారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, బండి సంజయ్ బీజేపీ వ్యవహారాలు మానుకొని టీఆర్ఎస్ సభ్యుడిగా తమ పార్టీ అంశాలు, మంత్రుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పనులపై మాట్లాడాల్సిన విపక్షాల నాయకులు టీఆర్ఎస్ అంతర్గత విషయాలపై మాట్లాడడం శోచనీయమన్నారు. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదన్నారు. తాము బీజేపీ గురించి, బండి సంజయ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన తన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకుంటుందన్నారు. ఆయన వ్యవహార శైలి మూలంగా తమ పార్టీ చులకన అవుతున్నదని, తమ పరువు పోతున్నదని బీజేపీ నాయకులే చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. సంజయ్ చిలుక జోస్యాలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన భాష తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రాజెక్టులను సందర్శించినా, దేవుళ్లను దర్శించుకున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నచ్చకపోవడం చౌకబారు వ్యవహారమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించేనని స్పష్టం చేశారు. చితిమంటలపై చలికాచుకునే వ్యక్తిత్వం సంజయ్దని మండిపడ్డారు. అభివృద్ధిపై ధ్యాస, ఆలోచన ఏమాత్రం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, తప్పక బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దుబ్బాకలో ఒక్క సీటు గెలిచి విర్రవీగుతున్నారని, తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసినప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. సంజయ్ వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలు చూస్తే ఆయనకు చదువు చెప్పిన గురువులే సిగ్గుపడేలా ఉందన్నారు. బీజేపీ సీనియర్ నాయకత్వాన్ని పక్కన బెట్టి వారిని చులకనగా చూస్తున్నారని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని కాలబెట్టిన తీరు మరిచిపోయారా అని గుర్తుచేశారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా సమయం రాకముందే ఎన్నికలు పెట్టాలనే విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని, ఎండాకాలంలో కూడా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయంటే అది తమ ఘనతేనని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలంటే జరిగేది కాదని, మీ ఆటలు ఇక్కడ సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్సే గెలుపొందుతుందని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణారావు, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, తోట రాములు, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పైలట్‌పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
- ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ముఖాన్నే మార్చేసుకున్నాడు
- బట్టతల దాచి పెండ్లి చేసుకున్న భర్తకు షాక్ : విడాకులు కోరిన భార్య!
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- బార్ కౌన్సిల్ లేఖతో కేంద్రం, టీకా తయారీదారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- ముగిసిన తొలి రోజు ఆట..భారత్‌దే ఆధిపత్యం
- 22.5 కేజీల కేక్, భారీగా విందు.. గ్రాండ్‌గా గుర్రం బర్త్ డే
- అంగన్వాడీల గౌరవాన్ని పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం