మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 27, 2020 , 02:12:53

నూతన రెవెన్యూ చట్టానికి రైతుల మద్దతు

నూతన రెవెన్యూ చట్టానికి రైతుల మద్దతు

  • n వీణవంక, చందుర్తిలో ప్రదర్శనలు
  • n ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు
  • n ‘జై కేసీఆర్‌' అంటూ నినాదాలు.. 
  • n చిత్రపటాలకు పాలాభిషేకాలు 

వీణవంక/ చందుర్తి: కొత్త రెవెన్యూ చట్టంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతూనే ఉంది. శనివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని 26 గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు 500 ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. వీణవంక హెచ్‌పీ గ్యాస్‌ గోదాం నుంచి బస్టాండ్‌ దాకా హోరెత్తించారు. బస్టాండ్‌ ఆవరణలో సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దారిపొడవునా ‘జై కేసీఆర్‌, జై ఈటల’ అం టూ నినదించారు. ఎంపీపీ ముసిపట్ల రేణుక, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనునిత్యం రైతుల బాగోగులను చూస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదని కొనియాడారు. ఏళ్ల తరబడి భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతు కష్టాలు తీర్చేందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, చారిత్రాత్మక  రెవె న్యూ చట్టాన్ని తెచ్చారని చెప్పారు. ఇక్కడ వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత, పీఏసీఎస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యు డు హమీద్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సాదవరెడ్డి, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ నరహరి తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వాల బాలకిషన్‌రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోరె స్వామి, నేత లు రాయిశెట్టి శ్రీనివాస్‌, రవీందర్‌రావు, పోతుల నర్సయ్య, బుచ్చయ్యగౌడ్‌, గొర్రె రాజమౌళి, దాసారపు రాజు ఉన్నారు.

చందుర్తిలో ట్రాక్టర్ల మోత..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు ధూం ధాం చేశారు. లింగంపేట నుంచి మూడపల్లి దాకా 200 ట్రాక్ట ర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. దారిపొడవునా తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటూనే ‘జై కేసీఆర్‌, జై రమేశ్‌బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడారు. నూతన రెవెన్యూ చట్టం వజ్రాయుధంలాంటిదన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. చందుర్తి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కుతుందన్నారు. ఇక్కడ ఎంపీపీ బైరగోని లావణ్య, ఏఎంసీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాస్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్‌ జలగం కిషన్‌రావు, పాక్స్‌ చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్‌, వైస్‌ ఎంపీపీ అబ్రహం, కోఆప్షన్‌ సభ్యుడు బత్తుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌వై నాయకుడు ఈర్లపల్లి రాజు, నాయకులు మ్యాకల ఎల్లయ్య, డప్పుల అశోక్‌ ఉన్నారు.logo