మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 05, 2020 , 01:54:05

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి

  •    n చిన్న చిన్న దొంగతనాలపైనా   అన్ని కోణాల్లో విచారణ
  •     n  సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం : పెండింగ్‌ కేసుల పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించాలని సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు వివిధ స్థాయిల్లో సమీక్షలు ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం తిమ్మాపూర్‌ సర్కిల్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తులోని లోపాలు సరిదిద్దడం వల్ల పలు కేసులు పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. నేరస్తులకు శిక్షలు పడటం వల్లే నేరాలు నియంత్రణలోకి వస్తాయని, తద్వారా పోలీస్‌శాఖ ప్రతిష్ట మరింతగా పెరుగుతుందన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఒక్క ఫిర్యాదు కూడా పెండింగ్‌లో ఉండవద్దని, వెంటనే పరిష్కార మార్గాలు చూపాలన్నారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతరం ఉక్కుపాదం మోపాలన్నారు. చిన్న చిన్న దొంగతనాలు కూడా తీవ్రంగా పరిగణిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగించాలన్నారు. అక్రమ కార్యకలాపాలను నియంత్రణలోకి తేవడంలో కీలక పాత్ర పోషించే పోలీసులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. సమావేశంలో రూరల్‌ ఏసీపీ విజయసారథి, ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి రష్మి, సీఐ మహేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo