శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 16, 2020 , 02:38:04

ఎల్‌ఎండీ నుంచి దిగువ ఆయకట్టుకు విడుదల

ఎల్‌ఎండీ నుంచి దిగువ ఆయకట్టుకు విడుదల

  •  5వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో..  అవసరమైతే 6వేలకు పెంపు
  •  స్టేజ్‌-1, 2 పరిధిలో   1,700 చెరువులకు నీళ్లు 
  • తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు  
  • కాలువలు ధ్వంసం చేస్తే చర్యలు:     ఎస్సారెస్పీ జీవీసీ-4 ఎస్‌ఈ శివకుమార్‌

తిమ్మాపూర్‌ : లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) దిగువ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటలకు రాష్ట్ర సర్కారు సాగునీరందించనున్నది. స్టేజ్‌-1లో 5 లక్షలు, స్టేజ్‌-2లో 4లక్షల ఎకరాలు మొత్తం 9 లక్షల ఎకరాలతోపాటు 1700 చెరువులు, కుంటలను నింపనున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే హామీ ఇవ్వగా, అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని దిగువ మానేరు జలాశయం హెడ్‌ రెగ్యులేటరీ గేట్ల వద్ద ఎస్సారెస్పీ జీవీసీ (గోదావరి వ్యాలీ సర్కిల్‌)-4 ఎస్‌ఈ పీ శివకుమార్‌ స్విచ్‌ ఆన్‌ చేసి, జలాలను విడుదల చేశారు. హెడ్‌ రెగ్యులేటరీ వద్ద గేట్లను ఎత్తి కాకతీయ కాలువ ద్వారా మొదట 500 క్యూ సెక్కులు వదిలారు. దశల వారీగా సాయంత్రం వరకు 5వేల క్యూసెక్కులకు పెంచారు. అవసరాన్నిబట్టి 6వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. అం తకుముందు హెడ్‌ రెగ్యులేటరీ వద్ద పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల హన్మకొండలో మంత్రు లు, నీటిపారుదల శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో స్టేజ్‌-1, 2 పరిధిలోని చెరువులు, కుంటలతోపాటు ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపారు. అందులో భా గంగా మిడ్‌మానేరు నుంచి 5 టీఎంసీల నీటిని ముందుగా ఎల్‌ఎండీకి తరలిస్తున్నామని చెప్పా రు. కాకతీయ కాలువకు నిరంతరం నీటిని సరఫ రా చేస్తామని, 120 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వానకాలం పంటలు, చెరువులు, కుంటలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. మొదట స్టేజ్‌-2 పరిధిలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు జలాలను తరలిస్తామని, ఆ తర్వాత ఈ నెల 23 నుంచి స్టేజ్‌-1 పరిధిలోని చెరువులు, కుంటలు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చివరి ఆయకట్టుకు నీటిని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రైతులు సమస్యలుంటే అ ధికారుల దృష్టికి తేవాలని, కాలువలను ధ్వంసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాలువల వెంట ఎస్సారెస్పీ, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది నిరంతర గస్తీ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 9.781 టీఎంసీల నీరు ఉందని, 6వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో, 5వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్‌, డిప్యూటీ ఈఈలు సమ్మయ్య, సురేశ్‌కుమార్‌, ఏఈఈ అంజుమున్నీసా, ఏఈలు కాళిదాస్‌, వంశీధర్‌, ఎస్సారెస్పీ అధికారులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.


logo