శాతవాహన యూనివర్సిటీకి 20 కోట్లు
శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 20 : శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023లో పీఎం ఉషా (ఉచ్ఛతర్ శిక్షా అభియాన్), రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) కింద ప్రతిపాదనలు పంపించారు.
ఈ మేరకు మంగళవారం దేశంలోని 78 యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేశారు. అందులో శాతవాహనకు 20 కోట్లు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా వీసీ మల్లేశ్ మాట్లాడుతూ, వివిధ పథకాల కింద నిధులు మంజూరు కావాలంటే యూనివర్సిటీకి 12(బీ) హోదా ఉండాలన్నారు. ఈ హోదా ఇచ్చిన సమయంలో యూజీసీ న్యాక్ గ్రేడింగ్ సాధించాలనే షరతు విధించారని చెప్పారు. న్యాక్ గ్రేడ్ ఉంటే 100 కోట్లు అదనంగా మంజూరయ్యేవని తెలిపారు. కాగా, 20 కోట్లలో 10 కోట్లు భవనాలకు, 6 కోట్లు నూతన ఆవిషరణలకు, 4 కోట్లు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కోసం వినియోగిస్తామని వివరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

