ధర్మారం, డిసెంబర్19: ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో కరీంనగర్‌లోని మీనాక్షి మల్టీ స్పెషాలిటీ దవాఖాన వారు ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. గ్రామానికి చెందిన ప్రముఖ కంట్రాక్టర్ పోనుగోటి నవీన్‌రావు అధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.దవాఖానకు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చీటి కార్తీక్‌రావు, స్త్రీల వైద్య నిపుణుడు డాక్టర్ స్ఫూర్తిరావు, గౌతమి రెడ్డి, ఇతర ప్రముఖ వైద్యులు డాక్టర్ వికాస్, సుధీర్ ద్వారక, డాక్టర్ రోహిత్, రవికుమార్ శ్రీరామోజు, శ్రీపతి నాయుడు, ఆకుల సదానందం, జోగినిపల్లి శ్రీనివాస్‌రావు, కిశోర్, నవనీత్ రెడ్డి, రిషిత వర్ధన్‌రావు రోగులకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. చామనపల్లితో పాటు న్యూ కొత్తపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మందికి పరీక్షలు చేసి సుమారు రూ.లక్ష విలువైన మందులు పంపిణీ చేశారు. 25 మందికి నేత్ర పరీక్షలను నిర్వహించగా శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. వారికి కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తామని దవాఖాన వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో శిబిరం నిర్వాహకుడు నవీన్‌రావుతో పాటు స ర్పంచ్ దాసరి తిరుపతి, ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ భూసరాజుల వనిత శ్రీ నివాస్, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ గంగాధర గంగయ్య, న్యూ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ దార మల్లమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు పాలమాకుల మాధవ రెడ్డి, పాలమాకుల ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు నందాల మల్లేశం, నాయకులు ఈదుల రాజేందర్ రెడ్డి, అట్ల సతీష్‌రెడ్డి, దవాఖాన సిబ్బంది వినోద్, ఉప్పు శ్రీనివాస్, విజయ్, మడక మహేందర్, రాచర్ల రఘు, నిశాంత్ రెడ్డి,సంపత్,దివ్య, అక్షయ, శృతి, మౌనిక, సుప్రియ, ఆకుల మాధవి పాల్గొన్నారు.