చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రతిభా వంతులకు అభినందన
చొప్పదండి, డిసెంబర్ 19: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. కరీంనగర్‌లోని ఎస్వీజేసీలో చదువుతున్న చొప్పదండికి చెందిన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించారు. కాగా, విద్యార్థులు ఆదివారం బూర్గుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన అభినందించి, మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్న కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, ఎస్వీజేసీ సెక్రటరీ మహిపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్, కాంతాల రాంరెడ్డి, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, సంతోష్‌రెడ్డి, ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్లు మహిపాల్‌రెడ్డి, గణేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
గంగాధర, డిసెంబర్ 19: మండలంలోని మధురానగర్, మంగపేట గ్రామాల్లో గౌడ సంఘ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను బూరుగుపల్లిలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే, మధురానగర్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా, నిధుల మంజూరుపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు నాయకులు అంజి, మహిపాల్ తెలిపారు.