వేములవాడ, డిసెంబర్18: వేములవాడ ఏరి యా దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం నిర్వహించిన అభివృది కమిటీ సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడా రు. దవాఖానకు వచ్చే సామాన్య ప్రజలకు మెరుగై వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దవాఖానతో అవసరం ఉన్న మౌలిక వసతులు శుద్ధజల కేంద్రం, అల్ట్ట్రా సౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్‌రావు మాట్లాడుతూ, గడిచిన నాలుగు మాసాల్లో 135సాధారణ కాన్పులు, 35 శస్త్ర చికిత్సలు, 18 వేల మంది రోగులకు రోజువారి సేవలు అందించామని వివరించారు. కరోనా సమయంలోనూ 350మంది సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి ఇంటికి వెళ్లారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, గంగం స్వరూపారాణి, బైరగోని లావణ్య, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, నాగం భూమయ్య, సూపరింటెండెంట్లు రేగులపాటి మహేశ్‌రావు, మురళీధర్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, కౌన్సిలర్ నీలం కళ్యాణి, కమిటీ సభ్యులు రాపెల్లి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
నేడు చందుర్తిలో ఎమ్మెల్యే పర్యటన
రుద్రంగి (చందుర్తి), డిసెంబర్18: చందుర్తి లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదివారం పర్యటించనున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు. కార్యకర్త లు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
కోనరావుపేట, డిసెంబర్ 18: మామిడిపల్లి, బావుసాయిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదివారం పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య తెలిపారు. మామిడిపల్లి లో శ్రీ సీతారామస్వామి ఆలయం వద్ద రూ.1.16 లక్షలతో ఘాట్ రోడ్డు, రూ.13లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. బావుసాయిపేటలో రైతు వేదికను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.