సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్‌నివ్వగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విఛాన్ చేశారు.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇదని, ప్రేక్షకుల మోములపై నవ్వుల్ని పూయిస్తుందని దర్శకుడు తెలిపారు. తనకిది 15వ చిత్రమని, చక్కటి కామెడీతో అలరిస్తుందని సత్యదేవ్ అన్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్.ఎస్.కాంచి, సురేష్ గురు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: రామ్ మిరియాల, నిర్మాణ సంస్థ: త్రిశూల్ విజీనరీ స్టూడియోస్, దర్శకత్వం: లక్ష్మినారాయణ పుట్టంచెట్టి.