రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు
‘కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శంషాబాద్ మండలంలోని రైతుల నోట్లో మట్టికొడుతారా.. ఇదేం న్యాయం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇక్కడి ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని రేడియల్ రోడ్డు కోసం భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం’ అని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
- రేడియల్ రోడ్డు.. వద్దే వద్దు
- బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 18 : ‘కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శంషాబాద్ మండలంలోని రైతుల నోట్లో మట్టికొడుతారా.. ఇదేం న్యాయం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇక్కడి ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని రేడియల్ రోడ్డు కోసం భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం’ అని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ మండల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని రేడియల్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని భూములు దేశంలోనే ఖరీదైన భూములుగా మంచి గుర్తింపు ఉందని, అదే రంగారెడ్డి జిల్లా ప్రజల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం వారికి మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిన పథకాలనే అమలు చేయడంలేదు. కాని ప్రజల భూములు తీసుకొని రోడ్డు వేయడానికి ఎక్కడ నిధులు ఉన్నాయో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ జడ్పిటీసీ బుర్కుంట సతీష్, నర్కూడ సర్పంచ్ శేఖర్‌యాదవ్, ఉప సర్పంచ్ మహేశ్ ముదిరాజ్,తహసీల్దార్ రవీందర్దత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

