దుండిగల్: దుండిగల్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ -2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, ఇంజినీరింగ్ శాఖల్లో అవినీతిచోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆయా సెక్షన్ల అధికారులు, సిబ్బందిని విచారించారు.
ప్రధానంగా టౌన్ ప్ల్లానింగ్లో చోటుచేసుకుంటున్న భవన నిర్మాణాల అడ్డగోలు అనుమతులు, అక్రమ వసూళ్లపై దృష్టి సారించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. లెక్కుకు మించి అక్రమ నిర్మాణాలు ఉండగా ఒకటి, రెండింటిపై చర్యలు తీసుకుని, మిగతా వాటిని ఎందుకు వదిలేస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నట్లు తెలిపారు.