“మజిలీ’ నా కెరీర్‌కి బ్రేక్‌నిచ్చింది. ఆ టైమ్‌లో మంచి ఆఫర్లొస్తున్నాయి. ఓ పెద్ద హీరోయిన్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అయితే సెట్లో ఒకతను నాముందే ‘ఇతన్ని ఎందుకు పిలిచారు’ అంటూ అవమానపరిచేలా మాట్లాడారు. అనంతరకాలంలో నేను.. కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్‌తో కలిసి ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా చేశా.
నా లైఫ్‌లో గొప్పగా ఫీలైన సందర్భం అది. నా దృష్టిలో అదే నిజమైన విజయం’ అన్నారు సుహాస్. ఆయన శివానీ నగరంతో కలిసి నటించిన ‘హే బల్వంత్’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. గోపీ అచ్చర దర్శకుడు. బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ‘నాట్ ఏ టైటిల్’ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సుహాస్ పై విధంగా స్పందించారు. టైటిల్ మారినా ఈ సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మారదని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. తమ సంస్థకు తొలి చిత్రమిదని, విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని చిత్ర నిర్మాత బి.నరేంద్ర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.