గంభీరావుపేట ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ విజయ
కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల పార్టీ బీమా చెక్కు అందజేత
గంభీరావుపేట, జనవరి 18: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ పేర్కొన్నారు. మండలంలోని రాజుపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కోడూరి చిన్నలింగం గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంజూరైన రూ.2లక్షల పార్టీ బీమా చెక్కును మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కార్యకర్తల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ అండగా నిలుస్తున్నదని తెలిపారు. పార్టీకి సేవ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందితే బాధిత కుటుంబానికి బీమా సొమ్ము అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, సర్పంచ్ అల్లె సత్యం, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, అల్లె సత్యం, కమ్మరి రాజారాం, రమేశ్, సంజీవ్, చెవుల మల్లేశం తదితరులున్నారు.