పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 17: జిల్లాలో వివిధ పథకాల ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను 5వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు పీ పద్మజ, 6వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో 5వ స్థాయీ ( స్త్రీ, శిశు సంక్షేమం), 6వ స్థాయీ ( సాంఘిక సంక్షే మం) కమిటీ సమావేశాలు అధ్యక్షురాళ్ల అధ్యక్షతన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, అవసరమున్న చోట కేంద్రాలకు మరమ్మతు చేయాలని సూచించారు. 90 శాతం వైకల్యం ఉన్న ఉండి, డిగ్రీ చదువుతున్న దివ్యాంగులకు ల్యాప్టాప్ అందించాలని 5వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు సూచించారు. 3వ స్థాయీ సంఘం (వ్యవసాయం) అధ్యక్షురాలు మండిగ రేణుక అనివార్య కారణాలతో సమావేశానికి హాజరు కాకపోవటంతో సమావేశాన్ని వాయిదా వేశామని జడ్పీ సీఈవో శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీలు గంట రాములు, తగరం సుమలత , జడ్పీ సూపరింటెండెంట్ శంకరయ్య తదితరులున్నారు.