చిగురుమామిడి, నవంబర్ 17: దేశ రక్షణ కోసం పోరాడి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు కీలకపాత్ర పోషించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉద్యమనాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు 82వ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేశారు. ఇక్కడ సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, చెప్యాల మమత, జకుల రవీందర్, బోయిని శ్రీనివాస్, సన్నీళ్ల వెంకటేశం, ఎంపీటీసీలు మెడబోయిన తిరుపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలు కల్వల రాజేశ్వర్‌రెడ్డి, చెప్యాల శ్రీనివాస్, పెనుకుల తిరుపతి, మండల కోశాధికారి ఒంటెల కిషన్‌రెడ్డి, ప్రచార కార్యదర్శులు బెజ్జంకి రాంబాబు, మహంకాళి కొమురయ్య, బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ అనుమాండ్ల సత్యనారాయణ, మైనార్టీ అధ్యక్షుడు సర్వర్ పాషా, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు బోయిని మనోజ్, నాయకులు అచ్చ రవీందర్, పోటు మల్లారెడ్డి, బోయిని శంకర్, రాధారపు తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, ఎస్కే సిరాజ్, పిల్లి వేణు, కల్వల సంపత్‌రెడ్డి, ఉప సర్పంచ్ అన్నాడి మల్లికార్జున్‌రెడ్డి, రామంచ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రాజమల్లు, మీడియా కోఆర్డినేటర్ రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 17: హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు ఐలయ్య, శ్రీనివాస్, కౌన్సిలర్లు రమాదేవి, సుశీల, శ్రీనివాస్, నాయకులు కన్నబోయిన శ్రీనివాస్, ప్రభాకర్, దయాకర్‌రెడ్డి, నరేశ్, ఖాలీద్హుస్సేన్, రమణారెడ్డి, గందె సాయి తదితరులు ఉన్నారు.
సైదాపూర్, నవంబర్ 17: మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశసేవలో పాల్గొన్న కెప్టెన్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకట్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, కొండా గణేశ్, రేగుల సుమలతాఅశోక్, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, ఎంపీటీసీలు తొంట ఓదెలు, గాజర్ల భాగ్యాఓదెలు, దిశ కమిటీ సభ్యురాలు ఓరుగంటి దేవేంద్ర, ఉపసర్పంచ్ పోతిరెడ్డి హరీశ్‌రావు, సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, అశోక్, శ్రీనివాస్, నరేశ్, మహిపాల్‌సింగ్, రవి ఉన్నారు.