స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ కుమార్‌దీపక్
ఓదెల, ఆగస్టు 16: హరిపురం గుట్టల్లో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు ద్వారా గొర్రెల మేతకు ఇబ్బంది అవుతుందని గొర్రె లకాపర్లు వనం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పారు. దీంతో అడిషనల్ కలెక్టర్ గొర్రెలకాపర్లతో మాట్లాడారు. ఇక్కడ 10 ఎకరాలకు బదులుగా ఐదు ఎకరాల్లో ప్రకృతి వనం ఏర్పాటుకు నిర్ణయించారు. అందులో 25 వేల మొక్కలకు కార్యాచరణ తయా రు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంట డీఎల్పీవో దేవకీదేవి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో వాజిద్, కార్యదర్శులు శ్రీనివాస్, భానుప్రసాద్ తదితరులు ఉన్నారు.
పనులు ప్రారంభం
రామగిరి, ఆగస్టు 16: రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మేడిపల్లి శివారులో సోమవారం బృహ త్ ప్రకృతి పనులు ప్రారంభమయ్యాయి. మంథని డీఎల్పీవో తేజావత్ రాంబాబు, ఎంపీడీవో విజయ్‌కుమార్, సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు పనులను పరిశీలించారు. పదెకరాల స్థలంలో 31 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో కాటం భాస్కర్, ఉపాధి ఏపీవో నర్సింగ రమేశ్, ఈసీ రాసపల్లి లక్ష్మణ్, టీఏ చిప్పకుర్తి కిరణ్, కార్యదర్శి ప్రదీప్, కారోబార్ శ్రీనివాస్, వార్డు సభ్యులు సురేశ్, కుమార్, తిరుపతి, వెంకటేశ్, రాజేందర్ తదితరులు ఉన్నారు.