ఆదేశించిన రాజన్న ఆలయ ఈవో
నాలుగు నెలల తర్వాత కదలిక
15 రోజుల్లో నివేదిక అందించాలని సూచన
వేములవాడ ఆగస్టు16: రాజన్న ఆల య ప్రసాదాల విభాగంలో నగదు దుర్వినియోగంపై శాఖాపరమైన విచారణకు ఆల య కార్యనిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ ఆదేశించారు. గత ఏప్రిల్‌లో కొవిడ్ నిబంధనల మేరకు ఆలయాన్ని మూసివేశారు. ఈ క్రమంలో ప్రసాదాల విక్రయ విభాగంలో సుమారు రూ. 2 లక్షలను సొంతానికి వాడుకున్నట్లుగా పర్వవేక్షకులు గుర్తించారు. ఈ విభాగంలోని ఓ ఉద్యోగి తానే వాడుకున్నట్లుగా చెప్పి నగదు కూడా చెల్లించారు. ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ రాజన్న ఆలయ పర్వవేక్షకులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగు నెలల తర్వాత ఆలయ సహాయ నిర్వహణాధికారి ప్రతాప నవీన్‌ను విచారణ అధికారిగా నియమించి విచారణకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని సూచించారు. విచారణ నేపథ్యంలో పెద్దల వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నదని ఆలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.