New substations | ముకరంపుర, జూలై 9: కరీంనగర్ సర్కిల్ కు కొత్తగా 16 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని ఎస్ఈ మేక రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. స్కాడ వంటి ఆధునిక సాంకేతికతతో అందుబాటులో కి వచ్చే ఈ సబ్ స్టేషన్ల ద్వారా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి వీలుంటుందన్నారు.
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ తో విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నందున భవిష్యత్తులో లో-వోల్టేజీ సమస్య ఉండదన్నారు. విద్యుత్ పంపిణీ మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. సాగు, గృహ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయన్నారు.
ఫీడర్ నష్టాలు, సబ్ స్టేషన్ల పై అధిక లోడ్ భారం తగ్గి నాణ్యమైన నిరంతర సరఫరాకు వీలుంటుందన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాలతో పాటు వినియోగదారులు ఆర్థిక వృద్ధి సాధించడానికి వీలుంటుందన్నారు.