రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు పంపిణీ
గోదావరిఖని, డిసెంబర్ 15: క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కోరుకంటి విజయమ్మ 3వ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.521 అందించారు. క్యాన్సర్ బారిన పడిన వారికి భరోసాగా నిలిచేందుకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెలా సహాయం అందిస్తామన్నారు. మేయర్ డా.అనిల్‌కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, ధాతు శ్రీనివాస్, రాజ్‌కుమార్, వేణుగోపాల్, తస్నీం భాను, నాయకులు ఉన్నారు.
అన్ని మతాలకూ సముచిత స్థానం
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ మైదానంలో నియోజకవర్గ పాస్టర్లు నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. శాంతికి మారుపేరుగా యేసుక్రీస్తు నిలుస్తారన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహించి, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందిస్తారన్నారు. నియోజక వర్గంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు దివాకర్, ఆర్జీ-1 జీఎం నారాయణ, దయానంద్‌గాంధీ, పాస్టర్లు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కమిషనర్
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుమన్‌రావు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను బుధవారం తన కార్యాలయంలో కలిశారు. కార్పొరేషన్లో పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించారు. ఇక్కడ మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు ఉన్నారు.