పెద్దపల్లి రూరల్, నవంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో రైతులు వడ్లు విక్రయించి మద్దతు ధర పొందాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, నిట్టూరు, నిమ్మనిపల్లి, పెద్దకల్వల, చందపల్లి గ్రామాల్లో పెద్దపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి వరి సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో వంకర మాటలు మాట్లాడేవారికి రైతులే తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ మాదారపు ఆంజనేయరావు, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచులు తంగెళ్ల జయప్రదాసంజీవరెడ్డి, ఆరెపల్లి కవితావెంకట్రాజం, పెర్క రిషితారాజేందర్, ఎంపీటీసీ జక్కుల రుక్కమ్మాలక్ష్మీనారాయణ, కౌన్సిలర్ రాజం మహంతాకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ వేల్పుల మల్లికార్జున్ రావు, డైరెక్టర్లు జయపాల్, సలేంద్ర రాములుయాదవ్, శ్రీనివాస్, రమేశ్, ఉపసర్పంచ్ ఈదునూరి జాన్, నాయకులు ఈదునూరి వెంకటి, ఆకుల శ్రీనివాస్, కిషన్ రెడ్డి, తిరుపతిరావు, కుమార్, మల్లయ్య, శంకర్, అశోక్, నవీన్, సల్లు, నర్సింగ్, మల్లేశం, యూసుఫ్, ఎడ్ల మల్లేశం, నెత్తెట్ల సతీశ్, జాపతి రాజేశం, రాజు, రవి, గాండ్ల శంకర్, నర్సింహారెడ్డి, మధునయ్య తదితరులు పాల్గొన్నారు.