1535 union | జ్యోతినగర్ (రామగుండం), జూన్ 27: తెలంగాణ జెన్కో నూతన డైరెక్టర్లను శుక్రవారం హైదరాబాద్ విద్యుత్ సౌధాలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. జెన్కో హైడిల్ డైరెక్టర్‌గా పీ బలరాజు, థర్మల్అండ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వై రాజశేఖర్‌రెడ్డి, కోల్అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్‌గా బీ నాగ్య, ఫైనాన్అండ్ కమర్షియల్ డైరెక్టర్‌గా వీర మహేందర్‌లు శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు.
కాగా 1535 యూనియన్ సెంట్రల్ అధ్యక్ష, కార్యదర్శిలు ఎంఏ వజీర్, డీ రాధాక్రిష్ణ ఆధ్వర్యంలో డైరెక్టర్లకు పుష్పాగుచ్చం అందజేసి శాలువలతో సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో యూనిట్ అధ్యక్షుడు పీ రాము, రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం 1535 యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుర్రం కుమారస్వామి, ఉపాధ్యక్షుడు అబ్దుల్ తఖీ, వివిధ విద్యుత్ కేంద్రాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.