Dog Attack | మానకొండూర్ రూరల్, మే 2 : గొర్లే ఉపాధిగా పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కుటుంబాన్ని కుక్కల గుంపు గొర్రెల మందపై పడి దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. కాగా ఐదు గొర్రెలు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన మారం రాయలింగు రోజు వారిగా గొర్రెల మందను బందోబస్తు ఏర్పాటు చేసి ఉంచాడు.
శుక్రవారం రాత్రి గొర్రెల మందపై కుక్కల దారి చేయగా 15 గొర్రెలు మృతి చెందాయి. కాగా, 5 గొర్రెలు తీవ్ర గాయాలై చికిత్స అందిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వచ్చి చూసే సరికి గొర్రెలు మృతి చెంది, తీవ్ర గాయాలైనట్లు బాధితుడు తెలిపారు. వెంటనే గ్రామ ప్రజాప్రతినిధులు పశు వైద్యాధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పశు వైద్యాధికారులు డాక్టర్ అరబింద్ రెడ్డి, డాక్టర్ సుష్మిత రెడ్డి, సిబ్బంది, సర్పంచ్ రాం రెడ్డి, ఉప సర్పంచ్ కొమురయ్య, మానకొండూర్ ఎంఎంసీ వైస్ చైర్మన్ రేమిడి తిరుమల్ రెడ్డి సందర్శించి, తీవ్రంగా గాయపడిన గొర్రెలకు చికిత్సను అందించారు.
ప్రభుత్వం ఆదుకోవాలి.. ఇన్సూరెన్స్ అందజేయాలి
– బబ్బురి కుమార్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ట్రస్ట్ చైర్మన్
దాడి సంఘటనను గురించి తెలుసుకొని రంగపేటలో బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించి, వారి వారికి ధైర్యాన్ని చెప్పుతూనే, గొర్లనే పెంపకమే జీవనాధరంగా పెట్టుకుని జీవిస్తున్న రైతులను కుక్కల దాడితో తీవ్రంగా నష్ట పోతున్నారని, అఖిల భారత యాదవ మహాసభ ట్రస్ట్ చైర్మన్ బబ్బురి కుమార్ యాదవ్ అన్నారు. దాదాపు రూ.2 లక్షల మేర నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఇన్సూరెన్స్ పద్ధతులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవాలను నమ్ముకుని జీవించే రైతులకు తక్షణ సహాయం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. వీరి వెంట అఖిలభారత యాదవ మహాసభ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన హరిప్రసాద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లేశం, నాయకులు ముక్కెర కొమురయ్య యాదవులు ఉన్నారు.