వెంకట్రావుపల్లి దళితుల ఏకగ్రీవ తీర్మానం
దళిత బంధుకు నిధుల విడుదలపై హర్షం
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14: మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళితులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేదర్ అని కొనియాడారు. దళితుల అభివృద్ధి కోసం ఆలోచించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేరొన్నారు. ప్రతి ఒక దళిత కుటుంబానికి ఈ పథకం వర్తించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16న మండలంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ప్రారంభించనున్నారని, ఈ సమావేశానికి పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తామని ప్రకటించారు. తమలాగే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని దళిత కుటుంబాలు గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని, ఉప ఎన్నికలో ఆయనను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలాతిరుపతి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరకుడు మధుకర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు చొప్పదండి స్వరూప, పోచయ్య, చొప్పదండి కిషన్, సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మారెట్ చైర్మన్ కాముని శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, సైదాపూర్ మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, పెరపల్లి సర్పంచ్ కొమురయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు మహేశ్, మధుకర్, చొప్పదండి తిరుమల, చొప్పదండి మార్తమ్మ , చొప్పదండి సునీల్, చొప్పదండి మొగిలి, కిషన్, మాజీ ఉప సర్పంచ్ చొప్పదండి సంజీవ్, స్వశక్తి సంఘాల మహిళలు, యూత్ అధ్యక్షుడు మంద కళాధర్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.