హుజురాబాద్‌టౌన్/హుజూరాబాద్ రూరల్: జనవరి 20: జమ్మికుంట నుంచి అక్రమంగా తరలించి హుజూరాబాద్‌లోని భద్రకాళి రైస్‌మిల్‌లో దిగుమతి చేస్తున్న 134 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పట్టణ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా కరీంనగర్‌రోడ్‌లో ఉన్న భద్రకాళి ఇండస్ట్రీస్ వద్ద ఒక వ్యక్తి పోలీసు వాహనాన్ని చూసి భయంతో పరుగులు పెట్టాడు. దీంతో పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై చీనానాయక్ అనుమానం వచ్చి పోలీస్ సిబ్బందితో కలిసి మిల్లులోకి వెళ్లి చూడగా ఒక వ్యానులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన నాగరాజు ఆ ఏరియాలో పీడీఎస్ బియ్యం తకువ ధరకు కొనుగోలు చేసి హుజూరాబాద్‌లోని భద్రకాళి రైస్‌మిల్ యజమాని ఆకుల సదాశివుడికి ఎకువ ధరకు అమ్ముతున్నట్లు తెలిసింది. 340 బస్తాల రేషన్ బియ్యంతో ఉన్న డీసీఎం వ్యాన్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. వ్యాన్ డ్రైవర్ నాగరాజుతోపాటు భద్రకాళి మిల్లు యజమాని ఆకుల సదాశివుడు, గుమస్తా శివుడిపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ, సివిల్ సైప్లె అధికారులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు.
కొత్తగట్టులో..
శంకరపట్నం (మానకొండూర్ రూరల్), జనవరి 20: కొత్తగట్టులో పోలీసులు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను గురువారం పట్టుకున్నారు. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన తీగల దేవయ్యతో పాటు రైస్‌ను తరలిస్తున్న ఆటోను స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్‌రావు తెలిపారు.