
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 12: రైతులు తాము పండిస్తున్న పంటలు, వాటితో వచ్చే లాభాలపై ఒక్క తాటిపైకి వచ్చి మాట్లాడుకునే సందర్భం లేక మధ్యవర్తులు, వ్యాపారులు, కమీషన్ ఏజంట్ల నిలువు దోపిడీకి గురైన సంఘటనలెన్నో ఉన్నా యి. గ్రామాల్లో కుల సంఘాల భవనాల్లో మాత్ర మే ఉండగా, రైతులకు ఓ ప్రత్యేక సంఘ భవనం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పంట లు, లాభసాటి సేద్యం గురించి వారు మాట్లాడుకునేందుకు వీలుగా క్లస్టర్‌కో వేదికను నిర్మిం చిం ది. ప్రస్తుతం ఈ వేదికలు సత్ఫలితాన్నిస్తున్నాయి.
రైతు సంక్షేమమే ధ్యేయం..
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సా యం అందిస్తున్నది. పొలంబాట పట్టిన రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ధీమాగా ఉండేందుకు సర్కారు అమలు చేసిన రైతుబీమా ద్వారా ఎందరినో ఆదుకుంటున్నది. 24గంటల ఉచిత కరెంట్‌ను ఇస్తూ రైతులకు పూర్తి భరోసా కల్పిస్తున్నది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీటితో నెర్రెలు బారిన నేలను పచ్చని పంటపొలాలుగా మార్చింది. ఇదే సందర్భంగా రైతులు ఒక్కటై తమ సమస్యలు మాట్లాడుకునేందుకు, సాధికారత సాధించేందుకు కొంగొత్త ఆలోచనలు ఒకరికొకరు పంచుకునేందుకు ప్రత్యేకంగా రైతు వేదికలు నిర్మాణం చేపట్టింది.
పంటల తీరు గురించి మాట్లాడేందుకు..
గతంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నప్పటికీ రైతులు తమ అవసరాల గురించి మండల కేంద్రానికి వెళ్లే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం క్లస్టర్ పరిధిలో పని చేసే వ్యవసాయ విస్తరణ అధికారి రైతులకు అందుబాటులో ఉండేలా పంటల తీరుపై మాట్లాడేందుకు వీలుగా రైతు వేదికలను నిర్మించారు. జిల్లాలో 57 క్లస్టర్లలో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని ప్రభుత్వం నిర్మించగా, మరికొన్ని మంత్రి కేటీఆర్ సొంత నిధులతో నిర్మించారు. ప్రభుత్వ ఆలోచన, రైతు సంక్షేమం కోసం దాతలు భూమిని విరాళంగా ఇస్తే, మరికొందరు నిర్మాణాలకు సహకరించారు. అవే రైతు వేదికలు నేడు ఆధునిక నైపు ణ్యం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రైతులను సంఘటితం చేసే వేదికలయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో ఇతర పంట ల సాగు, వాటితో వచ్చే ఇబ్బందులు, నేల తీరు, నీటి లభ్యత గురించి మాట్లాడుకునేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. సకల వసతులతో నిర్మించిన వేదికలో 125 కుర్చీలు, బీరువా, టేబుల్, నాలుగు గెస్ట్ కుర్చీలు ఏర్పాటు చేశారు. రైతు వేదికలను టీ పైబర్‌తో అనుసంధానించి నేరుగా శాస్త్రవేత్తలతో నూతన సాగు, విత్తనాలు, సమస్యలపై మాట్లాడేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.