
జగిత్యాల రూరల్, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి సహా య నిధి నిరుపేదల పాలిట వరంలా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రాచకొండ లతకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.14వేల విలువ గల చెక్కును క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాం గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, అడువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, డిసెంబర్ 12: పెంబట్ల గ్రామానికి చెంది న తేలు రాజేశం కుమారుడు కార్తీక్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.15,500 చెక్కును ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో దుబ్బ రాజన్న ఆలయ కమిటీ సభ్యుడు తోడేటి శేఖర్ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు అమీర్ తదితరులు పాల్గొన్నారు.