‘ఓసీల మహాధర్నా’ను విజయవంతం చేయండి
ఓసీల న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11గంటలకు నిర్వహించే ‘ఓసీల మహాధర్నా’ను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
- ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు పిలుపు
- బషీర్బాగ్లో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
రవీంద్రభారతి, ఫిబ్రవరి 18 : ఓసీల న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11గంటలకు నిర్వహించే ‘ఓసీల మహాధర్నా’ను విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ‘చలోఢిల్లీ-ఓసీల మహాధర్నా’ వాల్పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అగ్రకులాల్లోని పేద విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని, ఓసీ కులాల స్థితిగతుల అధ్యయానికి జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్లను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అర్హత వార్షిక ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఓసీ నిరుపేదలకు వర్తింపజేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్ని రాష్ర్టాల్లో సంపూర్ణంగా అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు. ధర్నాకు పలువురు కేంద్ర, రాష్టర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఓసీ ఐకాస నేతలు చందుపట్ల నరసింహారెడ్డి, అవోపా రాష్ట్ర అధ్యక్షుడు నమశ్శివాయ, న్యాయవాది కట్టంగూరి బుచ్చిరాంరెడ్డి, నిట్టూరి సతీశ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

