ధాన్యం కొనుగోళ్లపై అవగాహన లేని బండి సంజయ్
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, నవంబర్ 12: బీజేపీ బడా ఝూటా పార్టీ, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్‌లో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దొంగె దొంగ అన్నట్లు బీజేపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంటే, బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి జీవో తెచ్చే దమ్ము కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ కు ఉందా అని ప్రశ్నించారు. మత విద్వేషాలు, కుల రాజకీయాలు చేస్తూ ఓట్ల రాజకీయం చేయడమే తప్పా అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే గ్రామాల్లో బీజేపీ నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ వీర్ల వెంకటేశ్వర్రావు, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు శ్రీరాం మధుకర్, చిలుక రవీందర్, పర్లపెల్లి ప్రసాద్, జడ్పీటీసీలు కత్తెరపార ఉమ, రాంమోహన్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మహిపాల్‌రావు, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్లు తిర్మల్‌రావు, బాలగౌడ్, మురళీకృష్టారెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ గంగన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నవీన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, కొండయ్య, జితేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, నాయకులు రాజనర్సింగరావు, కృష్ణారావు, కిష్టారెడ్డి, సుదర్శన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.