జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
కార్పొరేషన్, నవంబర్ 12: కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు చేపట్టారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు నగరంలోని విలీన గ్రామాల్లోంచి రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, రేకుర్తి, పద్మనగర్, ఆరెపల్లి ప్రాంతాల నుంచి రైతులు, టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చారు.
కొత్తపల్లి, నవంబర్ 12: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తరలివెళ్లారు. చింతకుంట వద్ద వాహన శ్రేణిని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. తరలివెళ్లిన వారిలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
రామడుగు, నవంబర్ 12: వెదిర అనుబంధ గ్రామం రాజాజీనగర్ కూడలి వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 400 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా గంట్ల జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుంటారని, యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం అన్నదాతలకు పిడుగుపాటు లాంటిదన్నారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై గంగాధరలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరుకానున్న దీక్షా శిబిరానికి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 12: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు మండలంలోని పార్టీ శ్రేణులు, రైతులు తరలివెళ్లారు. చేగుర్తి నుంచి బల్మూరి ఆనందరావు, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ అశోక్‌గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, ఎంపీటీసీ స్వరూప, చంద్రమోహన్, ఆర్బీఎస్ కన్వీనర్ గాండ్ల లక్ష్మీనారాయణ, కిషన్, నాయకులు గాండ్ల కొమురయ్య, కోటి, చెర్లభూత్కూర్ నుంచి సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, వార్డు సభ్యుడు రమేశ్, దుర్శేడ్ నుంచి ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, శ్రీరామోజు తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, గోపాల్పూర్ నుంచి వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సర్పంచ్ ఊరడి మంజుల-మల్లారెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో వైస్ చైర్మన్ నర్సయ్య, మంద రాజమల్లు, టీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి, మొగ్దుంపూర్ నుంచి సర్పంచ్ నర్సయ్య, ఎంపీటీసీ పుష్ప-అంజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజు, లచ్చయ్య, ఆంజనేయులు, లక్ష్మణ్, రాజిరెడ్డి తరలివెళ్లారు.