జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు
కార్పొరేషన్, జనవరి 12: జిల్లాలో బుధవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివేకానంద చౌరస్తాలో వివేకానందుడి విగ్రహానికి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్ దంపతులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులను సన్మానించి, యువజన పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అలాగే, వివేకానందుడి విగ్రహానికి టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, పలువురు కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి విజయ, పెద్దపల్లి జితేందర్, నాయకులు సత్తినేని శ్రీనివాస్, మొగులోజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వివేకానందుడి చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకుడు వొడ్నాల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు శ్రీధర్, ప్రశాంత్, శ్యాం, సాగర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద చౌరస్తాలోని వివేకానందుడి విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు ఎన్నం ప్రకాశ్, జ్యోతి, మాధవ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వివేకానందుడి జయంతిని పురసరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ తీశారు. స్థానిక వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ సంఘటన కార్యదర్శి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ మహేశ్, జిల్లా కన్వీనర్ మల్యాల రాకేశ్, విభాగ్ మహిళా ఇన్చార్జి సౌమ్య, జిల్లా మహిళా ప్రేరణ ఇన్చార్జి ప్రవళిక, నగర జోనల్ ఇన్చార్జి విష్ణు, నగర సంయుక్త కార్యదర్శి నందు, నాయకులు సమిత్, సాయి, వివిధ కళాశాలల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ వర్ధన్, భార్గవ, శృతి, నందు, స్వామి, తిలక్, అరుణ్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.
పల్లవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో..
కొత్తపల్లి, జనవరి 12: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో పల్లవి స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు వొడ్నాల రాజు ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. డీవైఎస్వో రాజవీరు పాల్గొని వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్, యువజన సంఘం ప్రతినిధులు గుండ్ల శ్రీధర్, బాకారపు ప్రశాంత్, వొడ్నాల శ్యాం, బాకారాపు సాగర్, తోడెంగ హరీశ్, పూర్ణచందర్ పాల్గొన్నారు. రేకుర్తిలో వివేకానందుడి చిత్రపటానికి కృషి యూత్ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కృషి యూత్ సభ్యులు బండారి చంద్రయ్య, గొల్లె వేణుగోపాల్, సురేశ్, లింగమూర్తి, సాయికృష్ణ, బాలకృష్ణ, నేతకాని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద పాఠశాలలో..
కమాన్‌చౌరస్తా, జనవరి 12: భగత్‌నగర్‌లోని వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థలో యూత్ ఫెస్ట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ హాజరై మాట్లాడారు. వివేకానందుడి బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జాతీయ యువజన పురసారం అందుకున్న మహ్మద్ అజామ్‌ను వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, డాక్టర్ ఎల్ రాజభాసర్ రెడ్డి, సీఏ డీ నిరంజనాచారి, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మందల నగేశ్ రెడ్డి, జే సత్యనారాయణ రెడ్డి, సముద్రాల నాగేశ్వర్రావు, దేశిని శ్రీనివాస్, కొండు జనార్దన్, పుల్లూరి రవీందర్, పాఠశాల డైరెక్టర్ సౌగాని అనుదీప్, ఏవో తుంగాని సంపత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉజ్వల పారులోని వివేకానందుడి విగ్రహానికి 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు రేండ్ల కళింగ శేఖర్, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగపల్లి రాజేశ్వర్, కళాకారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు యాగండ్ల అనిల్‌కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణా రెడ్డి, నవనీత్ రావు, భగవాన్ రావు, ఉప్పుల శ్రీహరి, నగర కార్యదర్శి తోట రాజేందర్, బజరంగ్ దళ్ కన్వీనర్ శంకర్, హన్మంతు, అశోక్, యువకులు పాల్గొన్నారు.
శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో..
జ్యోతినగర్‌లోని సాధన సూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించగా ముఖ్య అతిథిగా శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. క్లబ్ సభ్యులతో కలిసి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లయన్ డాక్టర్ ఎస్ మనోహరాచారి, లయన్ ఎం అరవింద్‌బాబు, లయన్ సీహెచ్ శ్రీనివాసరావు, లయన్ ఎం సత్యనారాయణరావు, జోనల్ చైర్మన్ లయన్ తిరుపతి రెడ్డి, లయన్ తిరుపతి రావు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, జనవరి 12: జ్యోతినగర్‌లోని వివేకానందుడి విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దొగ్గలి శ్రీధర్ పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సిరిపురం అరుణ్, ఎడ్ల సురేందర్, అబ్దుల్ షఫీయొద్దీన్ పాల్గొన్నారు. అలాగే, జ్యోతినగర్‌లోని వివేకానందుడి విగ్రహానికి మున్నూరుకాపు ఉద్యోగుల, విశాంత్ర ఉద్యోగుల సాంస్కృతిక కార్యదర్శి, రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ యూనియన్ కో-ఆర్డినేటర్ పసుల రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.