
చిగురుమామిడి, డిసెంబర్ 11: ఇందుర్తి (హుస్నాబాద్) నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు చేసిన సేవలు మరువలేనివని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని ఇందుర్తి గ్రామంలో శనివారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహావిషరణ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. ఇందుర్తి నియోజకవర్గ ప్రజలతో బొమ్మ వెంకటేశ్వర్లుకు అనుబంధం ఎనలేనిదని కొనియాడారు. న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత-వెంకట్, ఎంపీపీ కొత్త వినీత, వైస్‌ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ అందె స్వరూప, ఎంపీటీసీలు అందె స్వప్న, కోమటిరెడ్డి చంద్రకళ, మాజీ ఎంపీపీ అందె సుజాత, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మూగ జయశ్రీ, కంది తిరుపతిరెడ్డి, బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, చిట్టిమల్ల రవీందర్, వంగర మల్లేశం, మామిడి అంజయ్య, రామోజు కృష్ణమాచారి, అందె చిన్న స్వామి, ఎసే సిరాజ్, చింతపూల ఆంజనేయులు, సాంబారి కొమురయ్య, కరివేద మహేందర్ రెడ్డి, కొమ్మెర మంజుల, కొమ్మెర మహేందర్ రెడ్డి, కోనేటి రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.