సింగరేణి అధికారులు
వారోత్సవాలు ప్రారంభం
యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 11: బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నాణ్యమైన బొగ్గు అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్జీ-2 జీఎం టీ వెంకటేశ్వర్రావు సూచించారు. నాణ్యతా వారోత్సవాల్లో భాగంగా గురువారం జీఎం కార్యాలయంలో అధికారులతో కలిసి బొగ్గు నాణ్యతపై ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. బొగ్గులో బండరాళ్లు, మట్టి పెల్లలు లేకుండా తీసివేసి వినియోగదారులకు నాణ్యమైన సరుకును ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, ఏజీఎం శ్రీనివాసులు, అధికారులు ధనుంజయ్, జీ ప్రదీప్ కుమార్, ఎస్ అనిల్ కుమార్, మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, పిట్ సెక్రటరీ సత్యనారాయణ ఉన్నారు.
రామగిరి, నవంబర్ 11: వినియోగదారుడు సంతృప్తి చెందాలంటే బొగ్గు నాణ్యతే ప్రధానమని ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు బొగ్గు నాణ్యతా వారోత్సవాలను ఆర్జీ-3, ఏపీఏ ఏరియా పరిధిలో గురువారం ప్రారంభించారు. జీఎం కార్యాలయంలో జీఎం శ్రీనివాస్ నాణ్యతా పతాకాన్ని ఆవిష్కరించగా, క్వాలిటీ డీజీఎం వెంకటరమణ ప్రతిజ్ఞ ఉద్యోగులతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడ సీఎంవోఏఐ అధ్యక్షుడు నరేందర్, టీబీజీకేఎస్ ప్రతినిధి రామ్మూర్తి, ఎస్వోటూ జీఎం రఘుపతి, అధికారులు ఉన్నారు.
గోదావరిఖని, నవంబర్ 11: ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యతా పతాకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్జీ-1 జీఎం కే నారాయణ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్, సీఎంవోఏఐ ట్రెజరర్ తిరుపతి రెడ్డి, ఎస్వోటూ జీఎం త్యాగరాజు, ఏజీఎం రామకృష్ణ, లక్ష్మీనారాయణ, సలీం, వొల్లాల రమేశ్, గిరిధర్ రాజ్, ప్రవీణ్‌కుమార్, సారంగపాణి, చక్రవర్తి, ఆంజనేయ ప్రసాద్, వీరారెడ్డి ఉన్నారు.
ఆర్జీ-1లో బొగ్గు నాణ్యతా వారోత్సవాలను రీజినల్ ల్యాబ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ గిరిధర్ రాజు, క్వాలిటీ జీఎం నిరీక్షణ రాజ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం క్వాలిటీ జీఎం నాణ్యత ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో క్వాలిటీ డీజీఎం సలీం, కోల్ కంట్రోలర్ అధికారులు ఘోష్, రాయ్ తదితరులున్నారు.