ఇల్లెందు, ఫిబ్రవరి 18 : ఇల్లెందు మున్సిపాలిటీలో గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పారిశుధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుడు మాతాంగి కొమురయ్య గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం మున్సిపల్ విధులు నిర్వహిస్తున్న కొమరయ్య ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోయాడు. మృతదేహానికి పురపాలక సంఘం చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండేల రాజు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరయ్య అనేక సంవత్సరాలుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించారన్నారు. కరోనా కాలంలోనూ చాలా ధైర్యంగా ముందుకు వచ్చి సేవలందించారని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో కౌన్సిలర్లు గందె పద్మ, సదానందం, ఎండీ.కుష్బూ, మున్నా బాయ్ , రాధా కమల్ కోరి, రేఖా స్వరూప, రవిశంకర్, ఉల్లంఘి విజయలక్ష్మి, సతీష్, సీహెచ్ శృతి, రమేశ్ ఉన్నారు.

గుండెపోటుతో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి