సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టిన టీఆర్ఎస్, విద్యార్థి సంఘాల నాయకులు
కార్పొరేషన్, ఆగస్టు 11: టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై నగరంలో బుధవారం విద్యార్థి విభాగం నాయకులు సంబురాలు చేసుకున్నారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ యావత్ విద్యార్థి లోకం, యువతపై సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటించడానికి విద్యార్థులు, యువత సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్చార్జి చుక శ్రీనివాస్, నాయకులు నారదాసు వసంతరావు, పటేల్ శ్రావణ్ రెడ్డి, మాడిశెట్టి అజయ్, బొంకూరి మోహన్, గంగాధర చందు, అఫ్రోజ్, కొండపల్లి అజితరావు, జకుల అఖిలేశ్, రాచకొండ నరేశ్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
యాదవ, కుర్మ సంఘాల ఆధ్వర్యంలో..
కార్పొరేషన్, ఆగస్టు 11: నగరంలోని తెలంగాణ చౌక్‌లో తెలంగాణ యాదవ, కుర్మ మహాసభ, కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు యాదవులు, కుర్మ కులస్తులం రుణపడి ఉంటామని తెలిపారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తామన్నారు. హుజూరాబాద్‌లో బీసీ ముసుగు వేసుకున్న ధనవంతుడికి, పేదోడికి మధ్య జరుగుతున్న పోరులో శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో యాదవ, కుర్మ మహాసభ, విద్యార్థి నాయకులు బూస అంజయ్య యాదవ్, జక్కుల నాగరాజు, మంచాల రవి యాదవ్, గాలి రవి, కర్రె రాజు, మల్లేశం, స్వామి, వేణు, ప్రదీప్, అనిల్, మల్లేశం, మహేందర్, రమ్య, పద్మ, సురేందర్, సతీశ్, పవన్, రాజేశం, కలర్ సత్తన్న, వెంకన్న, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 11: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ ద్యావ మధుసూదన్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఫహాద్ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు, యువకులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి, ఉద్యమ నాయకులు బాల్క సుమన్‌కు ఎంపీగా, ఎమ్మెల్యేగా, పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కార్పొరేషన్ చైర్మన్లుగా ఇప్పటికే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. విద్యార్థి, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఉద్యమ నాయకులంతా రుణపడి ఉంటారన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్ భూక్యా తిరుపతినాయక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు, నాయకులు బండ వేణు, సాయి, సందుమల్ల రవివర్మ, తేజ, రవినాయక్, హరీశ్, నవీన్, మణినాయుడు, ఓంకార్, దాసరి వెంకట్‌రెడ్డి, సంపత్, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.