e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కరీంనగర్ అల్గునూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

అల్గునూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

అల్గునూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కార్పొరేషన్‌/కమాన్‌చౌరస్తా, జూన్‌ 11: కార్పొరేషన్‌లో విలీనమైన అల్గునూర్‌, సదాశివపల్లి గ్రామాలను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 8వ డివిజన్‌ (అల్గునూర్‌)లో సుమారు రూ. 60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన మేయర్‌ వై సునీల్‌ రావు, కార్పొరేటర్‌ సల్ల శారదారవీందర్‌తో కలిసి ప్రారంభించారు. మొదట అల్గునూర్‌ చౌరస్తాలో డివైడర్‌ సుందరీకరణ నేపథ్యంలో గ్రీనరీ అభివృద్ధి, మొక్కలు నాటే పనులకు భూమి పూజ చేశారు. ముదిరాజ్‌ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అల్గునూర్‌లో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టేలా కార్పొరేటర్‌, నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అల్గునూర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం రూ. 15 లక్షలు కేటాయించామని, విగ్రహం గుంటూర్‌లో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. అల్గునూర్‌లో అంబేద్కర్‌ విగ్రహం, ఐలాండ్‌, రూ. 50 లక్షలతో చేపట్టే సుందరీకరణ పనులకు మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌ రావు సహకారంతో టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎలుక అనితాఆంజనేయులు, కేడీసీసీబీ డైరెక్టర్‌ సింగిరెడ్డి స్వామిరెడ్డి, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జి జాప శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, అశోక్‌ రెడ్డి, పురంశెట్టి అనోహర్‌, సిల్ల పరశురాములు, సిరిసిల్ల అంజయ్య, అధికారులు ఈఈ రామన్‌, డీఈ ఓంప్రకాశ్‌, ఏఈ శ్రీవాణి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్గునూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ట్రెండింగ్‌

Advertisement