సెంటర్లలో సౌకర్యాలు కల్పించండి
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్
అధికారులు, రైసుమిల్లర్లతో సమీక్షా సమావేశం
కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ);జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచా లని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ ఆదేశిం చారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్ మిల్లర్లు, కోనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించా రు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన వెం టనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యంలో కోత విధించవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా కేటాయించిన రైస్ మిల్లులకు పంపించిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొ నుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సందర్భంలో రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినపుడు ఎదురవుతున్న సమస్యలను అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యల పరిషారానికి పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాసర్, సెక్రటరీ అన్నమనేని సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.