సీఎమ్మార్ ఎగవేతపై సీరియస్!
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఎగవేత మిల్లర్లపై అధికారులు సీరియస్‌గా ఉన్నారా..? డిఫాల్టర్లపై చర్యలకు రంగం సిద్ధం చేశారా..? రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగం చేయనున్నారా..? మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. తాజాగా, సివిల్ సైప్లె అధికారులు తహసీల్దార్లకు డిఫాల్టర్ మిల్లర్ల వివరాలను పంపించి, మిల్లర్లతో మాట్లాడి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
- కరీంనగర్ జిల్లాలో 109 మంది డిఫాల్టర్ మిల్లర్లు
- ఆస్తుల వివరాల సేకరిస్తున్న తహసీల్దార్లు
- రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగానికి రంగం సిద్ధం
- ఎగవేత మిల్లర్లతో జమ్మికుంట తహసీల్దార్ సమావేశం
- బకాయి బియ్యం పెట్టాలని ఆదేశం
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఎగవేత మిల్లర్లపై అధికారులు సీరియస్‌గా ఉన్నారా..? డిఫాల్టర్లపై చర్యలకు రంగం సిద్ధం చేశారా..? రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగం చేయనున్నారా..? మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. తాజాగా, సివిల్ సైప్లె అధికారులు తహసీల్దార్లకు డిఫాల్టర్ మిల్లర్ల వివరాలను పంపించి, మిల్లర్లతో మాట్లాడి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా, వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించి, పంపించాలని సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జమ్మికుంట తహసీల్దార్ వెంకట్‌రెడ్డి రైస్ మిల్లర్ల సంఘం సభ్యులను పిలిపించి, డిఫాల్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
జమ్మికుంట, మార్చి 30: కరీంనగర్ జిల్లాలోని సివిల్ సైప్లె అధికారులు రూ.వందల కోట్లు బకాయి ఉన్న మిల్లర్ల లిస్టు తయారు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు సీఎమ్మార్ బియ్యాన్ని అందించకుండా 109 మిల్లులు (కొందరు బకాయిలు చెల్లించామని చెబుతున్నారు) ఉన్నట్టు ధ్రువీకరించారు. ఆస్తుల లిస్టు తయారు చేసి నివేదిక అందించాలని జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు సంబంధింత లిస్టులను పంపించారు. అలాగే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్) యాక్టు ప్రయోగానికి ఆదేశాలిచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను బకాయిలు పడిన మిల్లర్ల మండలాల్లోని తహసీల్దార్లకు అందించారు.
ఈ చట్టం మిల్లర్ల స్థిర, చరాస్తులను వేలం వేసి బకాయిలు రాబట్టుకునేలా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. తహసీల్దార్లు బకాయిలు పడ్డ ఆయా మిల్లర్లకు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఆర్ఆర్ చట్టం వివరాలను తెలియజేసినట్టు వినికిడి. కాగా, అందులో ఏళ్లకాలంగా డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లు కొందరు వ్యాపారం చేయడం లేదు. మరి కొందరు చనిపోయారు. ఇంకొందరు ‘కేసులు పెట్టుకోండి చూద్దాం’ అనే తరహాలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే గతంలో కేసులు నమోదైన మిల్లర్లు జైలుకు వెళ్లారు. వ్యాపారాలకు దూరంగా ఉన్న మిల్లర్లు ఎంతో మంది తమ ఆస్తులను అమ్ముకున్నారు. ఇప్పుడు తమ వద్ద ఏమీ లేదని చేతులెత్తేస్తున్న పరిస్థితులున్నాయి. కొందరు మిల్లర్లు కోట్లాది రూపాయల బకాయిలుండగా.. వారికి సంబంధించిన ఆస్తులు రికవరీకి సరిపోవడం లేదని తెలుస్తున్నది. ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి సీఎస్ అధికారులకు పంపించేందుకు తహసీల్దార్లు నివేదికలు తయారు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

