Korutla Municipality | కోరుట్ల, జూన్ 2: పట్టణంలోని మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం గా నిలిచి ప్రతిజ్ఞ చేశారు.
కార్యాలయ ఉద్యోగులు, మెప్మా సిబ్బందికి వందరోజుల కార్యచరణ ప్రణాళిక పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 51 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమాన్ని కోరుట్ల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తడి, చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం గురించి, ప్లాస్టిక్ నిషేధం, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత, వనమహోత్సవం, భువన్ సర్వే, మహిళ సంఘాల పథకాల అమలు, మలేరియా డెంగ్యూ నివారణ చర్యలు, డ్రై డే ఫ్రైడే కార్యక్రమ నిర్వహణ, స్వచ్ఛత పోటీలు, మహిళా సంఘాలకు పురోగతిపై వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అంతకుముందు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ సిబ్బందికి పీపీ కిట్స్ పంపిణీ చేశారు. మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ను కమిషనర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఈ సురేష్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక అధికారి ప్రవీణ్, పారిశుద్ధ్య కార్మికులు, మహిళా సంఘాల సభ్యురాళ్ళు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.