ఘనంగా చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలు
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 9: టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు సోమవారం జిల్లా కేం ద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో చీటి నర్సింగరావు కేక్ కట్ చేయగా పెద్ద సంఖ్య లో నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సన్మానించి చిత్రపటాలను కానుకగా అందజేశారు. నర్సింగరావు మా ట్లాడుతూ టీఆర్ఎస్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ పార్టీ కోసం శ్రమిస్తున్నానని అన్నా రు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. అందరి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ కాలంలో అందరికీ అం దుబాటులో ఉండి మరిన్ని సేవలందిస్తానని పే ర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పట్టణశాఖ, మున్సిపల్ పాలకవర్గం, వెలమ సంక్షేమ మండ లి పాలకవర్గం, తంగళ్లపల్లి మండలశాఖ, జిల్లా సర్పంచ్ల ఫోరం, టీఆర్ఎస్ సోషల్ మీడియా, టీఆర్ఎస్ మైనారిటీ, బీసీ సెల్, సెస్ ఎంప్లాయీస్ యూనియన్, పద్మశాలీ సంఘం నాయకులు నర్సింగరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, బొల్లి రాంమోహన్, మ్యాన రవి, కొమిరె సంజీవ్, దిడ్డి శ్రీనివాస్, జూపల్లి వెంకట్రావు, జాపల్లి రాజేశ్వర్‌రావు, వేణుగోపాల్‌రావు, సామల శ్రీనివాస్, అగ్గి రాములు, కుంబాల మల్లారెడ్డి, సామల దేవదాస్, తాటి వెంకన్న, అమరేందర్‌రావు, గన్నమనేని శ్రీనివాసరావు, సామల దేవదాస్, గజభీంకా ర్ రాజన్న, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ఎల్లారెడ్డిపేట మండల నాయకులు పాల్గొన్నారు.