రైతు బీమా కింద రూ.5లక్షలు
బాధిత రైతు ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుంకె
రైతు కుటుంబాలకు అండగా ఉంటాం: రవిశంకర్
మల్యాల(కొడిమ్యాల), జనవరి 9: రైతు బందరు రాజయ్య కుటుంబానికి రాష్ట్ర సర్కారు అభయమిచ్చింది. అనుకోని పరిస్థితుల్లో గత నెల 27న మృతచెందగా, బాధిత కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్మును ఖాతాల్లో జమచేసింది. వివరాల్లోకి వెళితే.. కొడిమ్యాల మండలం అప్పారావుపేటకకు చెందిన బందరు రాజయ్య గత నెల 27న మృతిచెందాడు. రాజయ్య పేరిట కొడిమ్యాల మండలం పూడూర్ రెవెన్యూ గ్రామ శివారులోని 1.03 ఎకరాల భూమి ఉంది. రైతు బంధు కింద పసలుకు రూ. 5,437 వస్తున్నాయి. ఇప్పటికే రైతు బీమా కింద పేరు నమోదు చేసుకొని ఉన్నాడు. ఈ క్రమంలో భార్య రాజవ్వ రైతుభీమా పరిహారం కోసం మండల వ్యవసాయాధికారి జ్యోతిని సంప్రదించారు. ఈ క్రమంలో అన్ని వివరాలను ఎల్ఐసీ అధికారులకు సమర్పించగా, రాజవ్వకు చెందిన పూడూర్‌లోని ఇండియన్ బ్యాంక్ ఖాతాలో బీమా పరిహారం సొమ్ము ఈ నెల 6న జమైంది.
కర్షకుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే సుంకె
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుభీమాను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అప్పారావుపేటలోని బందరు రాజవ్వ ఇంటికి వెళ్లి బీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఇక్కడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సింగిల్‌విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అంకం రాజేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశ్, సర్పంచ్‌లు ఎగుర్ల తిరుపతి, శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి, నాయకులు వొల్లాల లింగం గౌడ్, నేరెల్ల మహేశ్, రొడ్డ శరత్, గంగుల మల్లేశ్‌యాదవ్, విక్కుర్థి నాగరాజు, అంజన్‌కుమార్, తిరుమలేష్, గణేశ్, సతీష్‌రెడ్డి ఉన్నారు.