కొత్తపల్లి, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా తనకు నచ్చిన క్రీడాంశాల్లో శిక్షణ పొంది ప్రతిభచూపాలని ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించి న కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ, ఖోఖో పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవానికి వినోద్ ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ, కష్టపడేతత్వం అలవడుతుందని చెప్పారు. క్రీడలతో విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు దోహదం చేస్తాయని వివరించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేలా కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల నిర్వహణ అభినందనీయమని కొనియాడారు. అథ్లెటిక్స్ క్రీడాకారుల సౌకర్యార్థం కరీంనగర్ జిల్లా కేంద్రం లో 7 కోట్ల నిధులతో అంతర్జాతీయ స్థాయి సింథటిక్ ట్రాక్ నిర్మాణం చివరి దశకు చేరిందని, మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ట్రాక్ వినియోగంలోకి వస్తే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలకు కరీంనగర్ వేదికవుతుందని వివరించారు. రానున్న 10, 15 ఏండ్లలో భారతదేశం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం తథ్యమని స్పష్టం చేశారు. మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
స్పాన్సర్షిప్ ఇస్తాం: కొండూరి
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలను వృత్తిగా స్వీకరించి జీవితంలో స్థిరపడాలని క్రీడాకారులకు సూ చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిం చే క్రీడాకారులకు కేడీసీసీ బ్యాంక్ తరపున స్పా న్సర్షిప్ అందజేస్తామన్నారు. ప్రజలు, యువత అవసరాలను తీర్చేందుకు కేడీసీసీ బ్యాంక్ అనేక విధాలుగా ఉపయోగపడుతుందన్నారు. అనంత రం అతిథులు విజేతలకు ట్రోఫీలను, నగదు బ హుమతులను అందజేశారు. ఇక్కడ మేయర్ వై సునీల్‌రావు, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పీ రమే శ్, డైరెక్టర్ ఎస్ఆర్ స్వామిరెడ్డి, పీ కృష్ణప్రసాద్, సీఈఓ ఎన్ సత్యనారాయణరావు, జీఎం బీ శ్రీధర్, ఎండీ రియాజ్, ఎన్ సత్యప్రసాద్, సత్యనారాయణ, సిరిసిల్ల వాలీబాల్ సంఘ సభ్యుడు సీహెచ్ శ్రీకుమార్, జిల్లా ఖోఖో, కబడ్డీ సంఘాల కార్యదర్శులు వై మహేందర్‌రావు, సీహెచ్ సంపత్‌రావు, డీవైఎస్ఓ కీర్తి రాజవీరు, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు ఉన్నారు.
విజేతలు వీరే..
ఖోఖోలో జగిత్యాల ఖోఖో సంఘం ప్రథమ స్థా నంలో నిలిచి, 20వేల నగదు బహుమతిని అం దుకుంది. అలాగే టీఎస్డబ్ల్యూర్ఎస్ మంథని బా లికల కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి 15 వేలు, కోరుట్ల ఖోఖో సంఘం జట్టు తృతీ య స్థానంలో నిలిచి 10వేలు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ దేవంపల్లి నాలుగో స్థానంలో నిలిచి 5వేల నగదు బహుమతిని అందుకున్నాయి. కబడ్డీలో ఆనపురం జట్టు ప్రథమ స్థానంలో నిలిచి, 20వేల నగదు బహుమతిని, మహబూబ్‌పల్లి ద్వితీయ స్థానంలో నిలిచి 15 వేలు, మంథని జట్టు తృతీయస్థానంలో నిలిచి 10వేలు, హుజూరాబాద్ జట్టు 4వ స్థానంలో నిచి 5వేల నగదు బహుమతిని అందుకున్నాయి.