పెండింగ్ కేసులపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
డీవైసీ, ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
హౌసింగ్‌బోర్డుకాలనీ, నవంబర్ 8: డయల్ యు వర్ కలెక్టర్‌కు ప్రజలు విన్నవించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ సమస్యల పరిషారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని వి నియోగించుకుంటున్నారన్నారు. సమస్యలను పెండింగ్‌లో పెట్టవద్దని నిర్దేశించారు. వివిధ కా ర్యాలయాలకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామడుగు మండలం నుంచి రమేశ్ మాట్లాడుతూ వెదిర గ్రామం నుంచి కిలోమీటర్ పొడుగునా రోడ్డు పాడైందని దానికి మరమ్మతు చేయించాలని కోరగా సర్వే చేయించి పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. చొప్పదండి నుంచి రాజశేఖర్ మా ట్లాడుతూ తన బావి నుంచి మున్సిపల్ అధికారులు తాగునీరు వాడుకొని డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేయగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ నుంచి వెన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే నెల 3న ప్రపంచ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించాలని కోరారు.కొవిడ్ నిబంధనలమేరకు వేడుకలను నిర్వహిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. రామడుగు నుంచి రాజేశ్ మా ట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బ్యాంకు ఖాతాలకు సంబంధించి బ్యాలె న్స్ వివరాలను ఇవ్వడం లేదని తెలుపగా, ఖాతా ల బ్యాలెన్స్ వివరాలు ఇప్పించాలని ఎల్డీఎంకు సూచించారు. ఇక్కడ ఆర్డీవో ఆనంద్ కు మార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఒ డాక్టర్ జువేరియా, మెప్మా పీడీ బీ రవీందర్, ఉ ద్యానవన శాఖ డీడీ శ్రీనివాస్, ఎల్డీఎం లక్ష్మణ్, డీపీవో వీర బుచ్చయ్య, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు ఉన్నారు.
ప్రజావాణికి 110 దరఖాస్తులు
ప్రజా సమస్యల సత్వర పరిషారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెం దిన 110 మంది దరఖాస్తులు అందజేశారు. ఇందులో 62 రెవెన్యూకు, 4 మున్సిపల్ కార్పొరేషన్‌కు 4, జిల్లా మెడికల్, హెల్త్‌కు, 7 జిల్లా పంచాయతీ శాఖకు, 4 జిల్లా స్త్రీ, శిశు, సంక్షేమ శాఖకు చెందినవి కాగా మిగితా 29 ఇతర శాఖలకు సంబంధించినవని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెం టనే పరిషరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఇక్కడ జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, డీఎంహెచ్ఓ జువేరియా ఉన్నారు.